
పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి
బోనకల్: శాంతిభద్రతల పరిరక్షణకు పెట్రోలింగ్ ముమ్మరం చేయడమే కాక పాత నేరస్తుల కదలికలపై నిఘా వేయాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు సూచించారు. బోనకల్ పోలీసుస్టేషన్‌ను గురువారం తనిఖీ చేసిన ఆయన స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, పెండింగ్ కేసుల విచారణపై ఆరాతీశారు. అనంతరం ప్రసాద్‌రావు మాట్లాడుతూ పోలీసులపై నమ్మకంతో స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలు, ఇతరత్రా అక్రమ రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ పొదిలి వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.