
ఆధునిక విధానాలతో లాభసాటిగా సాగు
చింతకాని: పంటల సాగులో రైతులు ఆధునిక పద్ధతులు అవలంభిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించవచ్చునని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. చింతకాని మండలం జగన్నాధపురం, పందిళ్లపల్లి, గాంధీనగర్ కాలనీల్లో పత్తి పంటను గురువారం ఆయన పరిశీలించారు. పత్తి విత్తనాలను జూలై 15వరకు విత్తుకునే అవకాశమున్నందున, భూమిలో తగిన తేమ వచ్చాకే నాటాలని సూచించారు. తొలుత విత్తన శుద్ధి చేయడం ద్వారా తెగుళ్లను కొంతమేర తగ్గుతాయని తెలిపారు. ఆతర్వాత ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, తెగుళ్ల నియంత్రణపై ఆయన రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓ మానస, ఏఈఓలు రాము, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.