
తల్లి మృతి, కుమారుడికి గాయాలు
పెనుబల్లి: ఆగి ఉన్న బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బోనకల్ మండలం గార్లపాడుకు చెందిన గుడికందుల కోటేశ్వరరావు సత్తుపల్లిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన గురువారం తన తల్లి సావిత్రి(60)ని తీసుకుని బైక్‌పై సత్తుపల్లి వెళ్తుండగా మార్గమధ్యలో పెనుబల్లి మండల టేకులపల్లి వద్ద లగేజీ సరిచేసేందుకు జాతీయ రహదారి పక్కన ఆగాడు. ఈక్రమంలో సత్తుపల్లి వైపు వెళ్తున్న లారీ వీరిని ఢీకొట్టగా తీవ్రగాయాలతో సావిత్రి అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే, కోటేశ్వరరావుకు సైతం గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు.