
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు మధిరలో జరిగే ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం 10–30 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లితో పాటు అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం సత్తుపల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు మంత్రి హాజరవుతారు.
ప్రధాని పిలుపుతో
‘అమ్మ పేరుతో మొక్క’
ఖమ్మం అర్బన్: పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ పిలుపుతో ‘అమ్మ పేరుతో మొక్క‘కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. ఖమ్మం రోటరీనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయం వద్ద పార్టీ నాయకుడు కుమిలి శ్రీనివాసరావు ఆధ్వర్యాన గురువారం మొక్కలు నాటగా కోటేశ్వరరావు మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మోదీ పాలనలో ప్రజలు ధైర్యంగా జీవిస్తున్నారని, ఇదే సమయాన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, నాయకులు విజయరాజు, అల్లిక అంజయ్య, కంపసాటి అంజన్న, మేడిపల్లి నీలిమ, హుస్సేన్, సీతారాములు, ముత్యం, పల్లపు వెంకన్న, రమేష్, కృష్ణ, సత్యనారాయణ, రాజు, నరేందర్, సాంబశివరావు పాల్గొన్నారు.
భూభారతి సదస్సుల్లో
దరఖాస్తుల వెల్లువ
ఎర్రుపాలెం: ఇటీవల అమల్లోకి వచ్చిన భూభారతి చట్టంపై గ్రామాల్లో నిర్వహిస్తున్న సదస్సులకు పెద్దసంఖ్యలో రైతులు హాజరై సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి తెలిపారు. ఎర్రుపాలెం రైతు వేదికలో గురువారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. సదస్సుల్లో అందిన దరఖాస్తులను పరిశీలించి పరి ష్కరిస్తామని, తద్వారా రైతుల ఇక్కట్లు తీరనున్నాయని చెప్పారు. ఈకార్యక్రమంలో మధిర మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, తహసీల్దార్ ఎం.ఉషాశారద, ఉద్యోగులు శిరీష, రవికుమార్‌తో పాటు గుడేటి బాబు రావు, షేక్ ఇస్మాయిల్, కంచర్ల వెంకటనరసయ్య, కడియం శ్రీనివాసరావు, మల్లెల లక్ష్మణ్‌రావు, షేక్ షాబాష్, బుర్రా వెంకటనారయణ, సూరంశెట్టి రాజేష్ పాల్గొన్నారు.
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ముదిగొండ: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) అందే రుణాలను రైతులు సద్వి నియోగం చేసుకోవాలని బ్యాంక్ సీఈఓ వెంకట ఆదిత్య సూచించారు. ముదిగొండలోని సొసైటీ కార్యాలయానికి గురువారం వచ్చిన ఆయన రుణాల మంజూరు, బకాయిలపై చర్చించారు. అనంతరం సీఈఓ మాట్లాడుతూ రైతులకు ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లతో పాటు గేదెల కొనుగోలుకు రుణాలు ఇవ్వాలని ఉద్యోగులకు సూచించారు. అనంతరం నూతనంగా నిర్మించిన సొసైటీ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. సొసైటీ చైర్మన్, వైస్‌చైర్మన్లు తుపాకుల యలగొండస్వామి, బట్టు పురుషోత్తం, సీఈఓ వెంకటరత్నం, డీజీఎం ఉదయశ్రీ, డీసీసీబీ బ్యాంక్ మేనేజర్లు మధులిక, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

నేడు మంత్రి పొంగులేటి పర్యటన