
మహిళల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: మహిళల అభివృద్ధి, ససంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళలను చిన్నచూపు చూస్తే, నేటి ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా తోడ్పాటునిస్తోందని తెలిపారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మాట్లాడుతూ మహిళల పేరిట అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. అనంతరం రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. అలాగే, ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యకర్త గుంటి భవాని ఇంట్లో సన్న బియ్యంతో భోజనం చేశారు. నాయకులు దుంపా రూప, జాను, కుమారి, తోట దేవీప్రసన్న, దామా స్వరూప, బిక్కసాని స్వరూప, దేవత్ దివ్య, కొత్తపల్లి పుష్ప, ఊరుకొండ చంద్రిక, అన్నపూర్ణ, కె.సుగుణ, సుగుణ, ప్రతిభారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు