టీ క్యాంటీన్లలో తనిఖీ | - | Sakshi
Sakshi News home page

టీ క్యాంటీన్లలో తనిఖీ

Jun 19 2025 4:18 AM | Updated on Jun 19 2025 4:18 AM

టీ క్

టీ క్యాంటీన్లలో తనిఖీ

ఖమ్మంమయూరిసెంటర్‌: జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో టీ క్యాంటీన్లను ఆహార తనిఖీ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. జిల్లా గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యాన బృందం రైల్వేస్టేషన్‌ రోడ్డు, కస్బాబజార్‌ ప్రాంతాల్లో టీ స్టాళ్లలోని టీపౌడర్‌, పాలు, ఇతర పదార్థాలను పరిశీలించారు. ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని కిరణ్‌కుమార్‌ హెచ్చరించారు. ఆహార తనిఖీ అధికారులు లోకేశ్‌, శరత్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ రతన్‌రావు పాల్గొన్నారు.

21న జాబ్‌మేళా

ఖమ్మంసహకారనగర్‌: ఖమ్మం బస్‌ డిపో రోడ్డులోని న్యూ చైతన్య అకాడమీ వద్ద హెచ్‌సీఎల్‌ టెక్‌ ఆధ్వర్యాన ఈ నెల 21న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ కె.రవిబాబు తెలిపా రు. 2023–24, 2024–25లో ఇంటర్‌ బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఒకేషనల్‌ గ్రూప్‌ల లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఐటీ, డీపీఓలుగా నియామకానికి ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్‌ మెమో, ఆధార్‌కార్డు జిరాక్స్‌లు, ఒక పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, ఆండ్రాయిడ్‌ మొబైల్‌తో హాజరు కావాలని సూ చించారు. వివరాలకు 83414 05102 నంబర్‌ లో సంప్రదించడంతో పాటుhttp:://bit. ly HCLTB& Telangana లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని డీఐఈఓ తెలిపారు.

గెలిచిన వారిపై

ఓడిపోయిన వారి దాడి

ఖమ్మంక్రైం: ఖమ్మంలోని ప్రైవేట్‌ అంబులెన్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఇటీవల జరగగా.. ఓడిన వారు ఆగ్రహంతో గెలిచిన వర్గీయులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ అంబులెన్స్‌ డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా చికిత్స పొందుతున్నాడు. పలు ప్రైవే ట్‌ ఆస్పత్రులకు సంబంధించిన అంబులెన్స్‌ డ్రైవర్ల యూనియన్‌ ఎన్ని కలు ఇటీవల జరిగాయి. ఇప్పటికే ఉన్న కార్యవర్గ బాధ్యులు ఓడిపోగా, కొత్తవారు గెలిచారు. లావాదేవీలపై చర్చించేందుకు నూతన కార్యవర్గం బాధ్యులు మంగళవారం ఖమ్మం నెహ్రూనగర్‌లో పాత యూనియన్‌ బాధ్యుల వద్దకు వెళ్లగా ఆగ్రహంతో ఉన్న వారు లెక్కలు వివరించే క్రమాన గొడవకు దిగారు. ఆపై అంబులెన్స్‌ డ్రైవర్‌ వినయ్‌ ఆధ్వర్యాన ఏలూరి శ్రీకాంత్‌, మైదులు, మహేశ్‌ తదితరులపై దాడి చేయగా శ్రీకాంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ధారించడంతో న్యాయమూర్తి శ్రీకాంత్‌ వాంగ్మూలం తీసుకున్నారు. కాగా, దాడికి పాల్పడిన వినయ్‌ తదితరులపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టు టౌన్‌ సీఐ బాలకృష్ణ తెలిపారు.

పరిశ్రమల ఏర్పాటుపై మహిళలకు అవగాహన

ఖమ్మంమయూరిసెంటర్‌: గ్రామీణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలతో పరిశ్రమలు ఏర్పాటు చేయించేలా అవగాహన కల్పిస్తున్నట్లు డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జెడ్పీ కార్యాలయంలో డీఆర్‌డీఏ, సెర్ప్‌ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో అడిషనల్‌ డీఆర్డీఓ ఆర్‌.జయశ్రీ మాట్లాడారు. మహిళలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు సదస్సుల్లో ఔత్సాహికుల ను ఎంపిక చేసి పరిశ్రమల ఏర్పాటు, నిర్వహ ణ, మెళకువలు, నైపుణ్యాభివృద్ధిపై 15 రోజుల శిక్షణ ఇస్తామని, అంతేకాక లైసెన్స్‌, రుణాల మంజూరులో అండగా నిలుస్తామని తెలిపారు. సమావేశంలో డీపీఎం దుర్గయ్య, జిల్లా సమాఖ్య కార్యదర్శి కేవీ విజయలక్ష్మి, కోశాధికారి వి. మరియమ్మ, సభ్యులు అలీఫ్‌ పాల్గొన్నారు.

రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి

బోనకల్‌: బోనకల్‌ రైల్వేస్టేషన్‌ సమీపాన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడడంతో మృతి చెందాడు. ఒడిశాకు చెందిన బిశ్వనాథ్‌ మహంతి (38) విజయవాడ వైపు వెళ్తున్న రైలులో బుధవారం ప్రయాణిస్తున్నాడు. ఆయన ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడడంతో తీవ్రగాయాలై మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు తెలిపారు.

టీ క్యాంటీన్లలో తనిఖీ1
1/1

టీ క్యాంటీన్లలో తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement