
హృద్రోగంతో పోరాడుతున్నా... ఆదుకోండి
ఖమ్మంమయూరిసెంటర్: పూట గడవడమే కష్టంగా ఉన్న ఓ నిరుపేదను గుండె జబ్బు మరింత బాధిస్తోంది. కనీసం చికిత్స చేయించుకునే పరిస్థితి లేకపోవడంతో దాతల చేయూత కోసం అర్థిస్తున్నాడు. ఖమ్మంకు చెందిన వివెంకటగోపీ కిషన్‌రావుకు 65ఏళ్లు. రోజు కూలీగా జీవిస్తుండగా, ఆయన భార్య టైలరింగ్ చేస్తుంది. కొంతకాలంగా హృద్రోగంతో బాధపడుతున్న కిషన్‌రావు ఇప్పుడు పనులకు వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. తెలిసిన వారి సాయంతో ఆస్పత్రికి వెళ్తే స్టంట్లు వేయాలని తెలిపారు. ఇందుకోసం తగిన స్థోమత లేకపోవడంతో ఆయన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురవుతోంది. ఈమేరక దాతలు 63040 09513 నంబర్‌కు సాయం పంపించి ఆదుకోవాలని కిషన్‌రావు కోరుతున్నాడు.
ఓ పేద వృద్ధుడి అభ్యర్థన