
మోదీ పాలనలోనే దేశాభివృద్ధి
ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్రమోదీ హయాంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు తెలిపారు. ఖమ్మం శ్రీనివాస్ నగర్‌లో సోమవారం నిర్వహించిన వికసిత్ భారత్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు పేదలందరికీ అందుతుండగా, దేశం అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. అలాగే, పాకిస్తాన్‌పై దాడి ద్వారా దేశ సైన్యం ఘనతను ప్రపంచానికి చాటారని చెప్పారు. అనంతరం వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి ఆయన బీజేపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నాయకులు గుత్త వెంకటేశ్వర్లు, పిట్టల వెంకట నరసయ్య, రుద్ర ప్రదీప్, కొణతం లక్ష్మీనారాయణ, నల్లగట్టు ప్రవీణ్, పమ్మి అనిత, ఈదుల భద్రం, నెల్లూరు బెనరీ, రేఖా సత్యనారాయణ యాదవ్, వీరవెల్లి రాజేష్, రాఘవగౌడ్, గోనెల శివ, మణి, రజినీరెడ్డి, శంకర్‌గౌడ్, డోన్వాన్ దాసు పాల్గొన్నారు.