
పని ఆగదు.. రోడ్డు పాడు కాదు
ఖమ్మం పదో డివిజన్‌లో అండర్ డ్రెయినేజీ నిర్మిస్తుండగా బైపాస్‌లోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద పనులు చేపట్టాల్సి ఉంది. అయితే, పైప్‌లైన్ వేయడానికి రోడ్డు తవ్వాల్సి రావడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని గుర్తించారు. అంతేకాక రోడ్డు కూడా పాడయ్యే అవకాశముండడంతో నిర్మాణ సంస్థ ప్రతినిధులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రోడ్డు అడుగున తవ్వకం చేపట్టి 16 పైపులు అమర్చే పనులు చేపట్టారు. ఆ తర్వాత సాగర్ కాల్వ అడుగు భాగాన సైతం ఇదే తరహాలో పైప్‌లైన్ వేయనున్నట్లు బాధ్యులు తెలిపారు.
– ఖమ్మం అర్బన్