
●‘శ్రీ చైతన్య’ సత్తా
ఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బెటర్‌మెంట్ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందించాక ఆయన మాట్లాడుతూ ఎంపీసీలో 13మంది 470కి 468 మార్కులు, బైపీసీలో 440కి 439 మార్కులు సాధించారన్నారు. ఎంపీసీలో బి.జీవన, ఏ.భవిత, పి.నందిని, వై.భరత్ తేజ, డి.యశ్వంత్, బి.ధరణి, కె.జ్యోతి, ఎం.నాగహాసిని, పి.మోక్షిత, ఎస్.నాగజ్యోతి, జి.భావన, బి.వర్షిత, జీర మేహక్ 468, బైపీసీలో కె.గాయత్రి 439, బి.అప్రూవ, జి.జోహాన్ విశిష్ఠ, కె.జ్యోత్స్న 438మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులను చైర్మన్, డైరెక్టర్‌తో పాటు అకడమిక్ డైరెక్టర్ బి.సాయిగీతిక, డీజీఎం సీహెచ్.చేతన్ మాథూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్‌ఆర్‌ఎస్‌డీ.వర్మ, డీన్ కృష్ణ, ఏజీఎంలు సీహెచ్.బ్రహ్మం, జి.ప్రకాష్, గోపాలకృష్ణ అభినందించారు.