
ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
సత్తుపల్లిటౌన్: పట్టణంలోని ద్వారకాపురి కాలనీలో ఆదివారం ఆటోలో తరలిస్తున్న ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నా రు. ద్వారకాపురికాలనీ రోడ్–7లో గజ్జల చంద్రకళ నివాసం నుంచి సుమారు 4 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఆటోలో వేస్తున్నారు. అదేకాలనీ రోడ్ నంబర్–2లో కొడాలి రమేశ్ ఆటోలో రెండు క్వింటాళ్లు వేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి రెండు చోట్ల బియ్యాన్ని పట్టుకున్నామని ఆర్‌ఐ జానీమియా తెలిపారు. కేసు నమోదు చేసి ఆటో, బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఆర్‌ఐ జానీమియా తెలిపారు.