
రోడ్డుపై గుంతలు పూడ్చిన రైతులు
ఖమ్మంఅర్బన్: చెరువుకట్టపై ఏర్పడిన గుంతలను రైతులే పూడ్చుకున్న ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలోని 15వ డివిజన్ కొత్తగూడెంలోని ధంసలాపురం చెరువుకట్టపై గుంతలు ఏర్పడ్డాయి. ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులే స్వ చ్ఛందంగా ముందుకు వచ్చి పూడ్చుకున్నారు. మాజీ కార్పొరేటర్ చేతుల నాగేశ్వరరావు, మొర్రిమేకల కోటయ్యయాదవ్, వాకధాని గురవయ్య, జంగాల నాగేశ్వరరావు, కాంపాటి హనుమంతరావు, తెల్లబోయిన వెంకటేశ్వర్లు, చేతుల రామారావు, చెవుల రమణయ్య, కంచర్ల వీరయ్య, జంగాల వలరాజు, వాకధాని వలరాజు తదితరులు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా
రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక ఆదివారం నేత్ర పర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వేసవి సెలవుల చివరి ఆదివారం కావడంతో నిత్యకల్యాణ వేడుకలోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ కనకదుర్గ అమ్మవారికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసరాల్లో సందడి నెలకొంది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించగా, క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.

రోడ్డుపై గుంతలు పూడ్చిన రైతులు

రోడ్డుపై గుంతలు పూడ్చిన రైతులు