
టీజీఎస్‌ఆర్‌టీసీ ఈయూ నూతన కమిటీ ఎన్నిక
ఖమ్మంమామిళ్లగూడెం: టీజీఎస్‌ఆర్‌టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఖమ్మం రీజియన్ కౌ న్సిల్ సమావేశం ఆదివారం గిరిప్రసాద్‌భవన్ లో రీజియన్ అధ్యక్షుడు గుడిబోయిన శ్రీనివా స్ అధ్యక్షతన జరిగినది. సమావేశంలో టీజీఎస్‌ఆర్‌టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఖమ్మం రీజియన్ అధ్యక్షుడిగా బూదాటి శ్రీనివాసరెడ్డి, రీజియన్ కార్యదర్శిగా పిల్లి రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గుడిబోయిన శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఈయూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పాటి అప్పారావు మాట్లాడారు. ఈ నెల 24న అన్ని సంఘాలతో సమావేశం హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం బీజీ కై ్లమేట్, బాగం హేమంతరావు మాట్లాడా రు. కందుల భాస్కర్‌రావు, తిమ్మినేని రామారావు, అరుణకుమారి, తిమ్మినేని రామారావు, రామచంద్రరావు, దేశబోయిన జగన్నాథం, బేతంపూడి బుచ్చిబాబు, జి.ఎస్.రెడ్డి, వెంకన్న, రమేశ్, అరుణమ్మ, కవిత, జరీనాబేగం, లాల్బి తదితరులు పాల్గొన్నారు.
తండ్రికి కుమార్తె తలకొరివి
దమ్మపేట: తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నాగుపల్లి గ్రామానికి చెందిన కునుసోతు రామకృష్ణకు మూడు రోజుల కిందట బ్రెయిన్ స్ట్రోక్ రాగా ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడికి కుమారులు లేకపోవడంతో బీటెక్ చదువుతున్న ఆయన పెద్ద కుమార్తె శ్రావిక తలకొరివి పెట్టాల్సి వచ్చింది. ఫాదర్స్‌డే రోజే తండ్రికి కుమార్తె అంత్యక్రియలు చేయాల్సిరావడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

టీజీఎస్‌ఆర్‌టీసీ ఈయూ నూతన కమిటీ ఎన్నిక