
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తల్లాడ: స్థానిక డాంబర్ ప్లాంట్ వద్ద గుర్తు తెలయని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తల్లాడకు చెందిన చల్లా కృష్ణయ్య (63) ఉదయం కల్లూరు రోడ్డులో ఉన్న తన పొలం వద్దకు వెళ్లి టీవీఎస్ మోపెడ్‌పై తిరిగి వస్తున్నాడు. డాంబర్ ప్లాంట్ వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో కృష్ణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారుడు చల్లా నాగులు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఫాదర్స్ డే రోజే..
తలకు దెబ్బ తగిలి తీవ్ర రక్త స్రావం కావటంతో కృష్ణయ్యను స్థానికులు గుర్తుపట్టలేక పోయారు. చిన్న కుమారుడు రాము అక్కడికొచ్చి కూడా తన తండ్రి కాదనుకొని వెళ్లిపోయాడు. ఆ తర్వాత రెండో కుమారుడు చల్లా నాగులు అక్కడికొచ్చి తన తండ్రి టీవీఎస్ మోపెడ్‌ను చూసి గుర్తు పట్టాడు. కాగా, ఫాదర్స్ డే రోజే తమను వదిలివెళ్లావా.. అంటూ కుమారులు, కుమార్తె విలపించిన తీరు అక్కడివారిని కలచివేసింది.
రైలు ఢీకొని సుతారి మేస్త్రి మృతి
ఖమ్మంక్రైం: రైలు ఢీకొని ఓ సుతారి మేసీ్త్ర మృతిచెందిన ఘటన ఆదివారం నగరంలో చోటుచేసుకుంది. ధంసలాపురానికి చెందిన నరం వెంకటేశ్వర్లు అలియాస్ వెంకన్న (75) సుతారి మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. ఇంటిసమీపంలో ఓ ఫంక్షన్‌కు హాజరై తన సైకిల్‌తో రైలుపట్టాలు దాటుతుండగా అటువైపు నుంచి వచ్చిన రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు చెవులు సరిగ్గా వినపడకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు ఉండగా ఒకకుమార్తె గతంలో మృతిచెందింది. ఘటనా స్థలాన్ని జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ సత్యనారాణరెడ్డి చేరుకొని అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నంశ్రీనివాసరావు బృందం సాయంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి