
‘నగ్నదేశం’ కావ్య సంపుటి ఆవిష్కరణ
ఖమ్మంగాంధీచౌక్: కవి, రచయిత, అనువాదకులు, చిత్రకారుడు సవ్యసాచి రచించిన కవితా సంపుటి ‘నగ్నదేశం’పుస్తక ఆవిష్కరణ ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్ టెండర్ రూట్స్ పాఠశాలలో ఆదివారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న కవి, కేంద్ర సాహిత్య అకాడమీ జరల్ కౌన్సిల్ సభ్యులు ప్రసేన్ మాట్లాడుతూ.. సవ్యసాచి కవిగా, అనువాదకునిగా రాణిస్తున్నారని తెలిపారు. పాత, కొత్త తరం కవులు రాస్తున్న ‘సిగ్నేచర్ పోయమ్స్’ను ఆంగ్ల భాషలోకి అనువాదం చేయడానికి పూనుకున్నారన్నారు. జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులు, కవి మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సవ్యసాచి సామాజిక కోణంలో కవిత్వాన్ని అందించటం అభినందనీయమన్నారు. విద్యావేత్త, కవి రవిమారుత్ మాట్లాడుతూ.. సవ్యసాచి మణిపూర్‌లో జరిగిన మారణహోమంలో సీ్త్రని నగ్నంగా నడిబజార్‌లో ఊరేగించిన ఉదంతాన్ని తాను రాసిన కవితా సంపుటి ‘నగ్నదేశం’లో వివరించారని తెలిపారు. కార్యక్రమంలో కవులు శ్రీరామకవచం సాగర్, అన్నవరం దేవేందర్, డాక్టర్ పోతగాని తదితరులు సవ్యసాచి రచనను అభినందించారు. కార్యక్రమంలో కవులు ఇబ్రహీం, నిర్గుణ్, సునంద, రాంకుమార్, శేషగిరి, వెంకటయ్య, అమృత వర్షిణి, జయరాజ్, ఆంజనేయులు, పి.వెంకటేశ్వర్లు, దేవ, రౌతు రవి తదితరులు పాల్గొన్నారు.