
అన్నామలై యూనివర్సిటీ నుంచి డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాల అధ్యాపకుడు మద్దినేని వెంకటేశ్వరరావుకు డాక్టరేట్ లభించింది. అన్నామలై యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభా గం ప్రొఫెసర్ ఎన్.సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో ఆయన ‘డైనమిక్ రిసోర్స్ అలకేషన్ అండ్ లోడ్ బ్యాలెన్సింగ్ ఇన్ క్లౌడ్ ఎన్విరాన్‌మెంట్’ అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావును ప్రియదర్శిని విద్యాసంస్థల చైర్మన్ కాటేపల్లి నవీన్‌బాబు, ప్రిన్సిపాళ్లు డాక్టర్ బి.గోపాల్, వి.రామారావు, అకడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ, అధ్యాపకులు ఇంజం నరసింహారావు, ఎం.శివకుమార్ అభినందించారు.
పెరిగిన పెంకు కార్మికుల వేతనాలు
ఇల్లెందురూరల్: పెంకు పరిశ్రమల యజమానులు, తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధుల మధ్య చర్చలు ఫలప్రదం కావడంతో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని కార్మికుల వేతనాలు పెరిగా యి. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా అసి స్టెంట్ లేబర్ ఆఫీసర్ సమక్షంలో ఇరువురు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం.. కాంట్రాక్టు కార్మికులకు సంబంధించి గత రేట్లపై అదనంగా లోన పనులకు 4శాతం, బయట పనులకు 5శాతం, రోజువారీ కూలీ రేట్లపై అదనంగా రూ.10, గుమస్తాలకు ప్రస్తు త వేతనాలపై అదనంగా నెలకు రూ.400 చొప్పున పెరిగాయి. ఈ ఒప్పందం 2026 జూన్ వరకు కొనసాగేలా ఒప్పందం కుదిరింది. చర్చల్లో తెలంగాణ టైల్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాంసింగ్, దుర్గాప్రసాద్, లక్ష్మినారాయణ, రంగబాబు, సత్తిబాబు, యజమాను లు సాంబశివరావు, అరవింద్, విక్రమ్‌రెడ్డి, పూర్ణచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘కాంగ్రెస్ శ్రేణులకే
ఇందిరమ్మ ఇళ్లు’
నేలకొండపల్లి: రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారడమే కాక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ధైర్యం చాలడం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడుతూ ఇందిరమ్మ ఇళ్లను ఆ పార్టీ శ్రేణులకే ఇస్తున్నారని ఆరోపించారు. అంతేకాక ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యారని పేర్కొన్నారు. కాగా, 11ఏళ్ల పాటు దేశంలో మోడీ సుస్థిర పాలన అందించారని తెలిపారు. అనంతరం నేలకొండపల్లిలో ఆయన మొక్కలు నాటడంతో పాటు కేంద్రప్రభుత్వ పథకాలతో రూపొందించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోటి హనుమంతరావు, పాగర్తి సుధాకర్, షర్పొద్దీన్, మన్నె కృష్ణారావు, భువనాసి దుర్గాప్రసాద్, గోవిందరావు, సూరేపల్లి జ్ఞానరత్నం, కందరబోయిన వెంకటరమణ, తంగెళ్ల సతీష్, కొండా హర్ష తదితరులు పాల్గొన్నారు.
బస్సును ఢీకొట్టిన లారీ
కామేపల్లి: ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటన కామేపల్లి మండలం మర్రిగూడెం స్టేజీ సమీపాన శనివారం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి ఇల్లెందుకు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తుండగా మర్రిగూడెం స్టేజీ వద్ద ఇల్లెందు వైపు నుంచి వస్తున్న యాష్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ, లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జయి డ్రైవర్లు తోటా పృథ్వీ, బి.సాయితో పాటు బస్సులో ఉన్న సముద్రాల లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. అలాగే, మరో పది మంది ప్రయాణీకల్లు గాయయడ్డారు. అయితే, లారీ క్యాబిన్‌లో డ్రైవర్ సాయి ఇరుక్కుపోగా స్థానికులు ట్రాక్టర్ల సాయంతో ఆయనను బయటకు తీశారు. ఈ ఘటనతో ఖమ్మం–ఇల్లెందు ప్రధాన రహదారిపై ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోగా కామేపల్లి ఎస్సై సాయికుమార్ చేరుకుని వాహనాలను పక్కకు తప్పించి రాకపోకలు క్రమబద్ధీకరించారు.

అన్నామలై యూనివర్సిటీ నుంచి డాక్టరేట్

అన్నామలై యూనివర్సిటీ నుంచి డాక్టరేట్