
ప్రజారోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి
బూర్గంపాడు: ప్రజారోగ్యంపై వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ సూచించారు. మోరంపల్లిబంజర పీహెచ్‌సీని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులు పరిశీలించారు. ఫార్మసీ గదిని తనిఖీ చేసి మందులను పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం ఆసన్నమైనందున అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గర్భిణులను నూరు శాతం నమోదు చేసి వారికి రక్తహీనత లేకుండా మందులు అందించాలని, ఆస్పత్రి ప్రసవాలను ప్రోత్సహించేందుకు వారికి ఏఎన్‌ఎంలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సమాచారం తీసుకోవాలని సూచించారు. ఆపరేషన్లు తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దూర ప్రాంత గర్భిణులను గుర్తించి వారి డెలివరీ సమయానికి ముందే ముందే ఆస్పత్రిలో చేర్పించాలని ఆదేశించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్‌నాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి, డాక్టర్ ఆర్.చైతన్య, ప్రసాద్, మధువరన్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజారోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి