
ఐఐటీకి చేరిన గిరిజన విద్యార్థులు
రఘునాథపాలెం: మారుమూల గిరిజన ప్రాంతాల నిరుపేద విద్యార్థులు గురుకులాల్లో చదుతూ తమ ప్రతిభ ద్వారా దేశంలోని ప్రఖ్యాత ఐఐటీల్లో సీట్లు సాధించడం అభినందనీయమని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. రఘునాథపాలెం గిరిజన గురుకు ల ప్రతిభా కళాశాల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చి ఐఐటీలు, నిట్‌ల్లో సీట్లు సాధించగా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం వారిని సన్మానించారు. ఈసందర్భంగా పీఓ మాట్లాడుతూ గురుకులాల్లో ఉన్న వసతులకు తోడు విద్యార్థుల కష్టం, అధ్యాపకుల కృషితో ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. కాగా, ఐఐటీలు, నిట్‌ల్లో సాధించిన కె.మన్యం, పి.ప్రశాంత్, పి.విఘ్నేశ్వర్, డి.చరణ్, ఆర్.సందీప్, ఎం.రాంచరణ్, ఆర్.భాను కుమార్, ఎం.ప్రకాశ్‌రాజ్, ఎం.గణేష్, బి.సిద్ధు, బి.వాసుని సన్మానించిన పీఓ భవిష్యత్‌లో మరింతగా రాణించాలని సూచించారు. గరుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి, కళాశాల ప్రిన్సిపాల్ మల్లెల బాలస్వామి, వైస్ ప్రిన్సిపాళ్లు మిట్టపల్లి నరసింహారావు, మాలోత్ శ్రీనివాస్, అధ్యాపకులు శివశంకరాచారి, సత్యనారాయణ, హరీష్, రమేష్, వెంకట్‌రెడ్డి, ప్రవీణ్, రమ్య, ఏసోబు పాల్గొన్నారు.
సన్మానించిన ఐటీడీఏ పీఓ రాహుల్