
గిరిప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఖమ్మంమామిళ్లగూడెం: వచ్చే నెల 10న బుద్ధ పూర్ణిమ సందర్భంగా అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరాం తెలిపారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం ఖమ్మం రీజియన్‌లోని మణుగూరు, సత్తుపల్లి, ఖమ్మం డిపోల నుంచి సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తామని పేర్కొన్నారు. జూలై 8న సాయంత్రం 7 గంటలకు ఖమ్మం నుంచి, మణుగూరు నుంచి 6 గంటలకు, సత్తుపల్లి నుంచి 7 గంటలకు బయలుదేరే బస్సులు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత 9వ తేదీ రాత్రి అరుణాచలం చేరుకుంటాయని తెలిపారు. అలాగే, 10వ తేదీన గిరిప్రదక్షిణ, అరుణాచలేశ్వరుడి దర్శనం అనంతరం మధ్యాహ్నం బయలుదేరే బస్సులు 11వ తేదీన ఉదయం డిపోలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఖమ్మం, సత్తుపల్లి నుంచి పెద్దలకు రూ.5 వేలు, పిల్లలకు రూ.2,500, మణుగూరు నుంచి పెద్దలకు రూ.5,500, పిల్లలకు రూ.2,750 చార్జీగా నిర్ణయించినట్లు ఆర్‌ఎం తెలిపారు. ఇతర వివరాలు, రిజర్వేషన్ కోసం మణుగూరు డిపో మేనేజర్ (99592 25963), సత్తుపల్లి డీఎం 99592 25962, ఖమ్మం డీఎం 99592 25958 నంబర్లలో సంప్రదించాలని ఆర్‌ఎం సూచించారు.