
పదవుల టెన్షన్..
‘హస్త’వాసి పెరిగినా..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ అత్యధిక సీట్లు గెలవడం ఒక కారణంగా చెప్పవచ్చు. ఇక్కడ పది స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎనిమిది మంది, పొత్తులో భాగంగా మరో స్థానంలో సీపీఐ అభ్యర్థి గెలిచారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో ఉమ్మడి జిల్లా తగిన బలాన్ని ఇచ్చినా ఆ స్థాయిలో పదవులు రాలేదన్న చర్చ ముఖ్య నేతల్లో జరుగుతోంది. ఒకటి, రెండు ఎమ్మెల్సీ స్థానాలు వస్తాయన్న ప్రచారం తొలి నాళ్లల్లో ప్రచారం జరిగినా ఆశపడిన నేతలకు నామినేటెడ్ పదవులతో సరిపెట్టారు. ఇంకా డజన్ మందికి పైగా నామినేటెడ్ పదవులను ఆశిస్తుండగా, ఇటీవల ప్రకటించిన టీపీసీసీ కార్యవర్గంలో కొందరికి స్థానం దక్కింది. దీంతో ఆశావహుల సంఖ్య తగ్గినప్పటికీ తమకు అనుకున్న పదవులు రావడం లేదనే అంతర్మథనంలో పలువురు ఉన్నారు.
ఆ పదవులు పెండింగ్‌లోనే..
చిన్నాచితక నామినేటెడ్ పదవులు కూడా ప్రకటించక ఆశావహుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. జిల్లాలోని వైరా, ఏన్కూరు మార్కెట్ కమిటీలను ప్రకటించకపోగా, ఏన్కూరు మార్కెట్ ఏజెన్సీ పరిధిలో ఉండడంతో సందిగ్ధత వీడడం లేదు. ఇక జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ప్రముఖ ఆలయ కమిటీల కోసం పలువురు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నా భర్తీపై జాప్యం జరుగుతోంది. ఇదిలా ఉండగా త్వరలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో అప్పటి వరకై నా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారా, లేదా అని ఆశావహులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
‘నామినేటెడ్’ ఆశావహుల్లో ఆందోళన
కుర్చీ లేక ముఖ్య నేతల్లో నైరాశ్యం
పార్టీ పదవులతోనే
సరిపెడుతున్న అధిష్టానం
ముగ్గురు మంత్రుల ఆశీస్సుల కోసం నాయకుల హైరానా
ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు నామినేటెడ్ పదవుల టెన్షన్ పట్టుకుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా తమ సేవలకు గుర్తింపు లేదనే నైరాశ్యం
అలుముకుంటోంది. ‘అధికారంలో లేకపోయినా పార్టీని
అంటి పెట్టుకుని ఉన్నాం, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా మాకు గుర్తింపు లభిండం లేదు’ అన్న ఆవేదన
వ్యక్తమవుతోంది. మరోవైపు నామినేటెడ్ పదవులపై ఆశ పెట్టుకున్న వారికి రాష్ట్ర స్థాయి పార్టీ పదవులు కేటాయిస్తున్నా ఇంకొందరు ఆశ వదులుకోలేక జిల్లా మంత్రుల ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు వస్తాయని అటు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ఇటు జిల్లా మంత్రులు చెబుతుండగా ఇది జరిగేది ఎన్నడోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
– సాక్షి ప్రతినిధి, ఖమ్మం
సుడా.. పీఠం ఎవరికి?
ఉమ్మడి జిల్లాలో సుడా(స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్ పదవిని నామినేటెడ్ పదవుల్లో కీలకంగా భావిస్తారు. గతంలో ఖమ్మం కార్పొరేషన్ వరకే దీని పరిధి ఉండగా ఇప్పుడు ఐదు నియోజకవర్గాలకు విస్తరించడంతో రాజకీ య ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాలోని రియల్ ఎస్జేట్ అంతా ‘సుడా’ పరిధిలోనే జరగనుండడం, అనుమతులు కీలకం కావడంతో పదవి దక్కించుకుంటే ఆర్థిక వనరులు సమకూరుతాయనే ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గాలు సుడా పరిధిలోనే ఉండగా.. పదవులు ఆశిస్తున్న నేతలు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఎవరికి పదవి దక్కుతుందోనన్న సస్పెన్స్ మాత్రం వీడడం లేదు.