
విద్యార్థులకు సీట్ల కేటాయింపు
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా ఎంపిక చేసిన కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో మొదటి విడతగా పలువురు విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఆయా విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం సీట్లు కేటాయిస్తూ ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ శుక్రవారం లేఖలు అందజేశారు. మొదటి దశలో 94 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. శుక్రవారం 64 మంది హాజరుకావడంతో సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం సీట్లు కేటాయించారు. మిగతా విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో సోమవారం తమ కార్యాలయంలో హాజరు కావాలని డీడీ సత్యనారాయణ సూచించారు.
నేడు ‘విత్తన’ ముసాయిదా కమిటీ సమావేశం
ఖమ్మంవ్యవసాయం: విత్తన చట్టం ముసాయిదా కమిటీ సమావేశాన్ని శనివా రం నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి అధ్యక్షతన శనివారం ఉదయం 10గంటలకు కలెక్టరేట్‌లో ఈ సమావేశం మొదలవుతుందని పేర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వ్యవసాయాధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులు, కేవీకేలు, ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ది సంస్థ అధికారులతో పాటు విత్తన డీలర్ల అసోసియేషన్ బాధ్యులు, పలువురు ఆదర్శ రైతులు పాల్గొంటారని డీఏఓ తెలిపారు.

విద్యార్థులకు సీట్ల కేటాయింపు