
కలెక్టర్‌గా అనుదీప్ బాధ్యతల స్వీకరణ
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేయగా హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని ఖమ్మం కలెక్టర్‌గా నియమించారు. దీంతో ఆయన శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి అనుదీప్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, డీఆర్వో పద్మశ్రీ, ఆర్డీఓ నర్సింహారావు, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, టీజీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కస్తాల సత్యనారాయణ, మోదుగు వేలాద్రితో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
రూ.50 లక్షలతో భవిత కేంద్రాల ఆధునికీకరణ
● జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలలు 59
నేలకొండపల్లి: జిల్లాలోని భవిత కేంద్రాల ఆధునికీకరణ కోసం నిధులు కేటాయించినట్లు విద్యాశాఖ సీఎంఓ వై.రాజశేఖర్ తెలిపారు. మండలంలోని మండ్రాజుపల్లి, నేలకొండపల్లి, బోదులబండ ప్రభుత్వ పాఠశాలలు, సింగారెడ్డిపాలెంలోని భవిత కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన విద్యార్థుల ప్రగతి, బడిబాటపై ఉపాధ్యాయులతో చర్చించాక మాట్లాడారు. జిల్లాలో 22 భవిత కేంద్రాలు ఉండగా, పక్కా భవనాల ఉన్నచోట మరమ్మతులు, సౌకర్యాల కల్పకు రూ.50 లక్షలు కేటాయించడమే కాక దివ్యాంగుల రవాణాకు వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఐఈఆర్‌పీలు, ఫిజియోథెరపిస్ట్‌లను నియమించనున్నామని వెల్లడించారు. కాగా, జిల్లాలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థి చేరని పాఠశాలలు 59 ఉండగా, వీటిలో కనీసం పది పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు కార్యాచరణ రూపొందించామని సీఎంఓ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంఈఓ బి.చలపతిరావు, హెచ్‌ఎం తొర్తి గురవయ్య పాల్గొన్నారు.

కలెక్టర్‌గా అనుదీప్ బాధ్యతల స్వీకరణ