
నేడు జాతీయ లోక్‌అదాలత్
ఖమ్మంలీగల్: జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధా న న్యాయమూర్తి జి.రాజగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు న్యాయ సేవా సదన్‌లో లోక్ అదాలత్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కేసుల పరిష్కారం కోసం పలు బెంచ్‌లను ఏర్పాటు చేయడమే కాక కక్షిదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
‘ఫాల్ట్ ప్యాసేజ్’ ఇండికేటర్ల ఏర్పాటు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని విద్యుత్ ఫీడర్లపై ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ల(ఎఫ్‌పీఐఎల్‌ఎస్) ఏర్పాటు పనుల్లో అధికారులు వేగం పెంచారు. ప్రకృతి వైపరీత్యాలు, ఈదురుగాలుల సమయాన విద్యుత్ అంతరాయం ఏర్పడుతుండగా, నిర్ధిష్టమైన ప్రాంతాన్ని గుర్తించి సరిచేసేందుకు సమయం పడుతోంది. ఈనేపథ్యాన కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించేందుకు ఎన్పీడీసీఎల్ అధికారులు ఎఫ్‌పీఐఎల్‌ఎస్ ఏర్పాటుకు నిర్ణయించారు. జిల్లాలోని 33 కేవీ 18 ఫీడర్లపై 78 చోట్ల, 11 కేవీ 37 ఫీడర్లపై 170 చోట్ల ఏర్పాటుచేయనుండగా, ఇప్పటికే పలు చోట్ల బిగించామని ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. త్వరలోనే మిగతా చోట్ల అమరుస్తామని వెల్లడించారు.