108 అంబులెన్స్‌లో ప్రసవం | - | Sakshi
Sakshi News home page

108 అంబులెన్స్‌లో ప్రసవం

Jun 10 2025 3:24 AM | Updated on Jun 10 2025 3:24 AM

108 అ

108 అంబులెన్స్‌లో ప్రసవం

నేలకొండపల్లి: పురుటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని 108లో ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించింది. మండలంలోని అప్పలనరసింహాపురం గ్రామానికి చెందిన మేఘనకు సోమవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు వస్తుండడంతో బోనకల్‌ 108 సిబ్బంది ఆమెను తీసుకుని ఖమ్మం ఆస్పత్రికి బయలుదేరారు. అయితే, మార్గమధ్యలో నొప్పులు పెరగడంతో ప్రకాష్‌నగర్‌ వంతెనపై ఆపిన అంబులెన్స్‌ సిబ్బంది మనోహర్‌, వెంకటరావు వాహనంలో ప్రసవం చేశారు. కాగా, మేఘనకు గతంలో నలుగురు కుమార్తెలు ఉండగా, ప్రస్తుతం ఐదో ప్రసవంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బాలింత, శిశువును ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

స్పోర్ట్స్‌ స్కూళ్లలో

ప్రవేశానికి 16నుంచి పోటీలు

ఖమ్మం స్పోర్ట్స్‌: రాష్ట్రంలోని హాకీంపేట, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశానికి మూడంచెల్లో పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. తొలిదఫా ఈనెల 16నుంచి 19వ తేదీ వరకు మండల స్థాయి ఎంపికలు ఉంటాయని వెల్లడించారు. ఆపై 25, 26వ తేదీల్లో జిల్లాస్థాయి, జూలై 1నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా, 30 మీటర్ల ఫ్లయింగ్‌ స్టార్ట్‌ స్టాండింగ్‌ బ్రాడ్‌జంప్‌, 800 మీటర్ల పరుగుతో పాటు ఇతర అంశాల్లో పోటీలు ఉంటాయని, 01–09–2016నుంచి 30–08–2017 మధ్య జన్మించిన వారు మాత్ర మే అర్హులని వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తొలుత అన్‌లైన్‌లో నమోదు చేసుకోవా లని, వివరాలకు ఖమ్మం పటేల్‌ స్టేడియంలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని డీవైఎస్‌ఓ సూచించారు.

ఖమ్మం మార్కెట్‌లోకి టాటా ‘న్యూ ఆల్ట్రోజ్‌’

ఖమ్మంఅర్బన్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ విడుదల చేసిన నూతన న్యూ ఆల్ట్రోజ్‌ కారును సోమవారం ఖమ్మం మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఖమ్మంలోని వీవీవీ మోటార్స్‌ షోరూంలో కారును నగర ఏసీపీ ఎస్‌.వీ. రమణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఆల్ట్రోజ్‌ వాహనం ఆకట్టుకునేలా ఉందని పేర్కొన్నారు. వీవీసీ సంస్థల ఎండీ వంకాయల పాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఆల్ట్రోజ్‌ వాహనం ప్రస్తుత మార్కెట్‌ అత్యంత విశ్వసనీయత కలిగిన వాహనంగా నిలుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వీరేన్‌ చౌదరి, ఆదిత్యచౌదరి, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.

108 అంబులెన్స్‌లో  ప్రసవం
1
1/1

108 అంబులెన్స్‌లో ప్రసవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement