
సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్
కల్లూరురూరల్: ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్‌టీ రామారావు అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారని ఆయన తనయుడు నందమూరి రామకృష్ణ తెలిపారు. కల్లూరు మండలం యజ్ఞనారాయణపురంలో ఏర్పాటు చేసిన ఎన్‌టీఆర్ విగ్రహాన్ని గురువారం ఆయన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇన్‌చార్జ్ టీడీ జనార్దన్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సంర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్‌టీఆర్ ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలు నేటికీ పేదలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో తెలుగు జాతికి గుర్తింపు తీసకొచ్చారని చెప్పారు. కాగా, ఎన్టీఆర్ విగ్రహం, అన్నదానాన్ని పోట్రు లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ పోట్రు ప్రవీణ్ ఏర్పాటు చేయగా శ్రేయస్ మీడియా అధినేత గండ్ర శ్రీనివాసరెడ్డి, రావి సూర్యనారాయణ, సామినేని నవీన్‌కుమార్, వాసిరెడ్డి రామనాథం, జాస్తి శ్రీనివాసరావు, కేతినేని హరీశ్, ఆళ్ల కమలాకర్‌రావు, పోట్రు శ్రీనివాసరావు, మండేపూడి సాయి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మాజీ సీఎం విగ్రహావిష్కరణలో
నందమూరి రామకృష్ణ