
పొంగు చల్లారింది !
వైరా: ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. సాధారణ జనమంతా చల్లని నీళ్లు లేదంటే కొబ్బరి నీళ్లు, కూల్‌డ్రింక్‌లతో తమ దాహార్తి తీర్చుకుంటారు. అదే మందుబాబులైతే ఈ రెండు నెలలు మద్యాన్ని పక్కన పెట్టేసి బీర్ల వైపు మొగ్గు చూపుతారు. తద్వారా ఏటా వేసవిలో బీర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రెండేళ్ల క్రితమైతే బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదు కాగా.. కొన్ని వైన్స్‌ల ఎదుట ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. వైరాలోని డిపో నుంచి ఉమ్మడి జిల్లాలోని వైన్స్, బార్లకు మద్యం సరఫరా చేస్తుండగా ఏప్రిల్, మే నెలల్లో బీర్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని ఎకై ్సజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
60వేల కేసులు డౌన్
వేసవిలో బీర్ల అమ్మకాలు పెరగాల్సింది పోయి లిక్కర్ విక్రయాలు విపరీతంగా పెరుగుతుండడం గమనార్హం. వైరాలోని డిపో నుంచి గతేడాది ఏప్రిల్‌లో రూ.181 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు సాగగా ఈ ఏడాది రూ.167 కోట్లకు అది పడిపోయింది. గతేడాది ఏప్రిల్‌లో డిపో నుంచి 2,25,739 బీరు కేసులు అమ్ముడవగా, లిక్కర్ 2,13,172 కేసులు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాత్రం బీర్లు 1,64,966 కేసులకే పరిమితం కాగా, లిక్కర్ కేసులు మాత్రం 2,00,507 అమ్ముడయ్యాయి. అంటే బీర్ల అమ్మకం 60,733 కేసుల మేర తగ్గింది.
ధరలు పెరిగాయానా?
ఉమ్మడి జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా వేసవిలో బీర్ల అమ్మకాలు పడిపోయాయి. గత నవంబర్‌లో ప్రభుత్వం ఒక్కో బీర్ ధరను రూ.20నుంచి రూ.40 మేర పెంచింది. మరోవైపు వాతావరణంలో తరచూ మార్పులు వస్తున్నాయి. రోజంతా ఎండ ఉన్నా సాయంత్రమయ్యే సరికి గాలిదుమారం, వాన ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగా కూడా బీర్ల అమ్మకాలు తగ్గాయని అంచనా వేస్తున్నారు. అయితే, ఏప్రిల్‌తో పోలిస్తే ఈనెలలో కాస్త పరిస్థితి మెరుగవుతోందని.. రానున్న రోజుల్లో ఇది మరింత పుంజుకుంటుందని వైన్స్, బార్ల యజమానులే కాక ఎకై ్సజ్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మండువేసవిలో బీర్లకు తగ్గిన డిమాండ్
ఇదే సమయాన పెరిగిన
లిక్కర్ అమ్మకాలు
బీర్ల ధరలు పెరగడమే కారణమని
అంచనా

పొంగు చల్లారింది !

పొంగు చల్లారింది !