
గిరిజన కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధి లోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో జరిగిన కౌన్సెలింగ్‌ను గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలల్లో వివిధ కోర్సులకు గాను 810 సీట్లు ఉండగా, 450 సీట్లలో బాలురకు ప్రవేశాలకు కల్పించామని తెలిపారు. మిగిలిన సీట్ల భర్తీకి త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు. అలాగే, బాలికల ప్రవేశాల కోసం శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు దేవదాస్, సీతారాం, వీరస్వామి, సత్యనారాయణ, భాస్కర్, హరికృష్ణ, పద్మావతి, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
విధుల్లో చేరిన
108 ప్రోగ్రాం మేనేజర్
ఖమ్మంవైద్యవిభాగం: ఈఎంఆర్‌ఐ, గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌గా శివకుమార్ నియమి తులయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 108(అత్యవసర సేవలు), 102(అమ్మ ఒడి), 1962(పశు సంచార) సేవలను పర్యవేక్షించనుండగా, గతంలో ప్రోగ్రాం మేనేజర్‌గా ఉన్న భూమా నాగేందర్ హైదరాబాద్ క్లస్టర్‌కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వరంగల్ నుంచి వచ్చిన శివకుమార్ గురువారం విధుల్లో చేరారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమై పలు సూచనలు చేశారు.
పది జిల్లాల
మత్స్యకారుల శిక్షణ
కూసుమంచి: పాలేరులోని పీ.వీ.నర్సింహా రావు మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్యకారులకు మూడు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణ గురువారం ప్రారంభమైంది. ‘జలాశయాల్లో మత్స్య అభివృద్ధి – యాజమాన్య పద్ధతులు’ అంశంపై ఇస్తున్న ఈ శిక్షణకు ఖమ్మం, నిజామాబాద్, హనుమకొండ, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సిరిసిల్ల జిల్లాల మత్స్యకారులు పాల్గొన్నారు. తొలిరోజు మత్స్యశాఖ నేషనల్ ఫెసిలిటేటర్ బి.లవకుమార్ మాట్లాడుతూ శిక్షణను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా మత్స్య సంపదలో రాష్ట్రాన్ని ముందు నిలపాలని సూచించారు. చేపల పెంపకంలో ఆధునిక పద్ధతులు అవలంబిస్తే మంచి ఫలి తాలు వస్తాయని చెప్పారు. పరిశోధనా కేంద్రం పూర్వ, ప్రస్తుత ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ జి.విద్యాసాగర్‌రెడ్డి, డాక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడగా మత్స్య శాస్త్రవేత్తలు రవీందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పాల్వంచ మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చకులు అర్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నివేదన, హారతి సమర్పించారు. అలాగే, మంత్రపుష్పం పఠించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.

గిరిజన కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్