
ఆడపిల్లతోనే ఇంటికి పరిపూర్ణత
రఘునాథపాలెం: ఆడపిల్ల పుట్టడంతో ఇంటికి పరి పూర్ణత వస్తుందనే విషయాన్ని గ్రహించి అమ్మాయిలను భారంగా కాకుండా వరంలా భావించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ పి.శ్రీజ సూచించారు. రఘునాథపాలెంకు చెందిన వాంకుడోత్ సునీత–నరేష్ దంపతులు ఇటీవల ఆడశిశువుకు జన్మనివ్వగా, ‘మా ఇంటి మణిదీపం’ కార్యక్రమంలో భాగంగా వారిని ఇన్‌చార్జ్ కలెక్టర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్‌రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.మాధవి, ఎంపీడీఓ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.