బోనకల్: వారబందీ విధానంలో విడుదలవుతున్న సాగర్ జలాలను వృథా చేయకుండా పంటలకు ఉపయోగించుకోవాలని జల వనరుల శాఖ ఎస్‌ఈ వాసంతి రైతులను కోరారు. బోనకల్ బ్రాంచ్ కెనాల్ పరిధిలో చివరి ఆయకట్టుకు నీరందించే ఆళ్లపాడు మైనర్‌ను సోమవారం ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఆళ్లపాడు రైతులు వారబందీ విదానంలో కాకుండా పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరారు. దీంతో స్పందించిన ఆమె ఆళ్లపాడు మైనర్‌కు ఎక్కువ మొత్తంగా నీరు విడుదల చేయాలని ఉద్యోగులను ఆదేశించారు. అలాగే, తహసీల్దార్ పున్నంచందర్ ఆధ్వర్యాన కాల్వపై అడ్డంకులను తొలగించగా రైతులు కృతజ్ఞతలు తెలిపారు. డీఈ తమ్మారపు వెంకటేశ్వర్లు, జేఈ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
జల వనరుల శాఖ ఎస్‌ఈ వాసంతి