రేసులో.. ముందుండేలా.. | - | Sakshi
Sakshi News home page

రేసులో.. ముందుండేలా..

May 24 2024 6:35 AM | Updated on May 24 2024 6:35 AM

రేసుల

రేసులో.. ముందుండేలా..

4.60 లక్షల మంది ఓటర్లు

మూడు ఉమ్మడి జిల్లాల్లో విస్తరించి ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 4.60 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు శ్రమిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులే లక్ష్యంగా ప్రచారం జరుగుతోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉద్యోగుల సమస్యలే ప్రధానాస్త్రంగా అగ్రనేతలు మొదలు అభ్యర్థుల వరకు ఓటర్లుగా ఉన్న నిరుద్యోగులను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్నారు.

స్పీడ్‌ పెంచిన తీన్మార్‌..

కాంగ్రెస్‌ బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న ప్రచారంలో వేగం పెంచారు. 2021లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన ఆయన 83,290 ఓట్లు సాధించారు. అయితే ఈసారి కాంగ్రెస్‌ మద్దతుతో పోటీకి దిగడంతో సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, టీజేఎస్‌ పార్టీలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న నేపథ్యాన తన గెలుపు నల్లేరుపై నడకేనని ఆయన భావిస్తున్నారు. కొద్ది రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రచారం చేస్తు న్న ఆయన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలతో కలిసి ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటున్నారు.

సిట్టింగ్‌ దక్కించుకునేలా..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మంగా తీసుకుంది. ఇప్పటికే అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డి ఉమ్మడి జిల్లాను కలియదిరిగారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి అత్యధిక ఓట్లు సాధించడం.. ప్రస్తుతం ఉప ఎన్నికలోనూ సిట్టింగ్‌ సీటును దక్కించుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ నేతలున్నారు. గత ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డికి 1,10,840 ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా అత్యధిక ఓట్లు సాధించి గెలుపు దరిచేరాలనే భావనలో అభ్యర్థి ఉన్నారు. ఇందులో భాగంగా స్థానిక నేతలు అభ్యర్థితో కలిసి ప్రచారంలో పాల్గొంటుండగా, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆ పార్టీ నాయకులు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తదితరులు సన్నాహక సమావేశాలకు హాజరయ్యారు. ఇక మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం సత్తుపల్లి, మధిర నియోజకవర్గం బోనకల్‌, పాలేరు నియోజకవర్గం బారుగూడెంలో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు.

బీజేపీ విస్తృత ప్రచారం

కమలనాథులు ప్రచార ఊపు పెంచారు. ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి తోడు జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ఇతర నేతలు ప్రచారంలో పాల్గొంటూ ఉద్యోగ, నిరుద్యోగ, విద్యార్థుల సమస్యలను పరిష్కరించే సత్తా తమకే ఉందని చెబుతున్నారు. అలాగే, అభ్యర్థి తరఫున ఇప్పటికే పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ జిల్లాలో ప్రచారం నిర్వహించగా.. గురువారం ఖమ్మంలో జరిగిన సమావేశాలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కొత్తగూడెంలో జరిగిన సమావేశానికి గురువారం మాజీ ఎమ్మెల్యే రఘునందర్‌రావు హాజరయ్యారు. గత ఎన్నికల్లోనూ పోటీ చేసిన ప్రేమేందర్‌రెడ్డికి 39,107 ఓట్లు రాగా.. ఈసారి అంతకుమించి వస్తాయనే నమ్మకంతో ఉన్నారు.

హోరెత్తుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

విజయమే లక్ష్యంగా

ప్రధాన పార్టీల కసరత్తు

అగ్రనేతలను రంగంలోకి దించిన పార్టీలు

మేము సైతం అంటున్న

స్వతంత్ర అభ్యర్థులు

రేపటితో ముగియనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం

నల్లగొండ – ఖమ్మం –

వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా.. ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొంది. కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితోపాటు స్వతంత్ర అభ్యర్థి, ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత పాలకూరి అశోక్‌ కుమార్‌ మధ్య రసవత్తరమైన పోటీ ఏర్పడింది. పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ప్రచారాన్ని కదం తొక్కిస్తున్నారు. ఉమ్మడి జిల్లాను మూడు పార్టీలు బలపర్చిన అభ్యర్థులు, వారి తరఫున అగ్రనేతలు చుట్టేస్తున్నారు. కాగా, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శనివారం ముగియనుండగా, సోమవారం పోలింగ్‌ జరుగుతుంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం

2021 ఎన్నికలో అభ్యర్థులకు పోలైన ఓట్లు

అభ్యర్థి బలపర్చిన పార్టీ ఓట్లు

పల్లా రాజేశ్వరరెడ్డి బీఆర్‌ఎస్‌ 1,10,840

తీన్మార్‌ మల్లన్న స్వతంత్ర 83,290

ప్రొఫెసర్‌ కోదండరామ్‌ టీజేఎస్‌ 70,072

ప్రేమేందర్‌రెడ్డి బీజేపీ 39,107

రాములునాయక్‌ కాంగ్రెస్‌ 27,588

సమస్యలే అజెండాగా..

నిరుద్యోగుల సమస్యలే అజెండాగా స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ప్రచారాన్ని కదం తొక్కిస్తున్నారు. ఇందులో అశోక అకాడమీ చైర్మన్‌ పాలకూరి అశోక్‌కుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా విద్యార్థులు, నిరుద్యోగ సమస్యలపై గళం వినిపిస్తానని చెబుతున్నారు. ఆయన గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వంలో విద్యాసమస్యలపై పోరాటాలు నిర్వహించారు. ఈమేరకు ఆయన అకాడమీ విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో తనకు ఉన్న పరిచయాలతో ఆయన ప్రచారంలో వేగం పెంచగా.. ఇప్పటికే మూడు ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగులు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలను కలిసి తనకు ఓటు వేయాలని కోరారు.

రేసులో.. ముందుండేలా..1
1/6

రేసులో.. ముందుండేలా..

రేసులో.. ముందుండేలా..2
2/6

రేసులో.. ముందుండేలా..

రేసులో.. ముందుండేలా..3
3/6

రేసులో.. ముందుండేలా..

రేసులో.. ముందుండేలా..4
4/6

రేసులో.. ముందుండేలా..

రేసులో.. ముందుండేలా..5
5/6

రేసులో.. ముందుండేలా..

రేసులో.. ముందుండేలా..6
6/6

రేసులో.. ముందుండేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement