శివాజీనగర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈ నెల 28న ఆర్‌సీబీ– హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుండగా, టికెట్ల కోసం ఎమ్మెల్యేలు ఆశగా ఉన్నారు. తమకు, కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వాలని గురువారం విధానసభలో ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా డిమాండ్ చేయడం గమనార్హం. బెంగళూరులోని జక్కూరు ఏరోడ్రోమ్ చర్చ టికెట్లకు దారితీసింది. ఏరోడ్రోమ్‌ని మరోచోటుకు తరలించి ఢిల్లీలో ఉన్న భారత్ మండపం తరహాలో భారీ సభా మందిరం, తపోవనం నిర్మించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సలహా ఇచ్చారని, కేంద్రం నుంచి రూ.300 కోట్ల సహాయం ఇస్తామన్నారని, కానీ తాను ఏరోడ్రోమ్‌ను మార్చడానికి ఒప్పుకోనని డీసీఎం డీకే శివకుమార్ తెలిపారు. మంత్రి కేజే జార్జ్ స్పందిస్తూ ఏరోడ్రోమ్‌లో 40 మంది పైలట్ శిక్షణార్థులు ఉన్నారని, అక్కడ పై వంతెన ఉన్నందున డీజీసీఏ విమానాల రాకపోకలకు అనుమతించలేదని చెప్పారు. ఏరోడ్రోమ్‌ను మరో చోటికి మార్చేదిలేదు, అక్కడ లక్ష సీట్లు కలిగిన క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలనే సలహాలు వచ్చాయన్నారు.
మరో స్టేడియం వద్దు
ఆ సమయంలో ఆర్.అశోక్ స్పందించి, అక్కడ స్టేడియం నిర్మిస్తే 60 వేల కార్లు సంచరిస్తాయి, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందన్నారు. జక్కూరు దేశంలోనే తొలి విమానం విహార ట్రైనింగ్ కేంద్రం, దానికి చారిత్రక నేపథ్యం ఉంది. దానిని మూసివేయరాదని డిమాండ్ చేశారు. నగరంలో క్రికెట్ మ్యాచ్‌లు జరిగితే మేము ఒక టికెట్ కోసం ఎదురుచూడాలి, ఇంక మరో స్టేడియం అవసరం లేదు అని చెప్పారు. చిన్నస్వామి మైదానంలో క్రికెట్ శిక్షణ కోసం 16 ఎకరాలను బాడుగకు ఇచ్చి డబ్బు సంపాదిస్తున్నారు, మద్యం అమ్ముతున్నారు అని అశోక్ ఆరోపించారు.
టికెట్లకు స్పీకర్ భరోసా
ఈ సమయంలో విజయానంద కాశప్పనవర్, కోనరెడ్డితో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు ఐపీఎల్ క్రికెట్ పోటీలను చూసేందుకు ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలి, వీఐపీ గ్యాలరీలో చోటివ్వాలని కోరగా, అన్ని పార్టీల వారు మద్దతు తెలిపారు. స్పీకర్ ఖాదర్ మాట్లాడుతూ, ఈ డిమాండ్‌ను తీవ్రంగా పరిగణించాలని, క్రికెట్ సంఘం అధికారులను పిలిపించి చర్చించాలి. ఎమ్మెల్యేకు నాలుగు టికెట్లు ఇచ్చేలా చూడాలని ఆదేశించారు. సరేనంటూ డీసీఎం శివకుమార్ తెలిపారు.
శివాజీనగర: బెంగళూరు ప్రపంచస్థాయి నగరం, ఇక్కడి సదుపాయాలను మరింతగా పెంచేందుకు, బెంగళూరు పేరును కాపాడుకునే దిశలో పలు పథకాలను రూపొందించినట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. విధానసభలో బెంగళూరు అభివృద్ధిపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ఆయన, బెంగళూరు కొత్త రహదారులు, సొరంగ రోడ్డు నిర్మాణం, పై వంతెనల పథకాలను రూపొందించామన్నారు. ట్రాఫిక్ ఒత్తిడి నియంత్రణకు కొత్తగా పార్కింగ్ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. బెంగళూరులో జనసంఖ్య 1 కోటి 40 లక్షలు, నగరంలో వాహనాలు 1 కోటి 30 లక్షలు ఉండగా, ఆ నిష్పత్తితో పోలిస్తే 8 శాతం రోడ్లు మాత్రమే ఉన్నాయన్నారు. దీనికి పరిష్కారంగా వివిధ రోడ్లు, వంతెనల పథకాలను చేపట్టామన్నారు. ఇప్పుడున్న రోడ్ల వెడల్పు, భూ స్వాధీనానికి అధిక ఖర్చు అవుతోంది, అందుచేత ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తున్నామన్నారు. బెంగళూరులో ఆస్తి పన్నును పెంచలేదని, ఈ దఫా రూ1,271 కోట్ల అధిక ఆస్తి పన్ను వసూలైందని, దీనికి ఓటీఎస్ కారణమని తెలిపారు. ప్రపంచంలో బెంగళూరు 6వ స్థానంలో ఉంది. హైదరాబాద్ 16వ స్థానంలో ఉంది. బెంగళూరుకు మరే నగరంతో పోల్చరాదన్నారు. రాష్ట్రానికి బెంగళూరు హృదయం వంటిదని, అభివృద్ధికి ఏమేమి చేయాలో అన్నీ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈ–ఖాతాల జారీ సక్రమంగా సాగాలని, లంచం అడిగే ఓ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
అలాంటి సలహాలను
ఒప్పుకోబోమన్న మంత్రులు
దానిని అక్కడే కొనసాగించాలని వెల్లడి
ఐపీఎల్ టికెట్ల కోసం ఎమ్మెల్యేల ఒత్తిడి
మంజూరుకు సభాపతి ఆదేశం
అభివృద్ధికి, ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు పథకాలు
విధానసభలో డీసీఎం డీకే శివ


