బ్యాంకులో నగలకు కోత
మైసూరు: బంగారం కుదువ పెట్టుకుని పరారైన వ్యాపారిని మైసూరు విజయనగర పోలీసులు అరెస్టు చేశారు. గోకులం నివాసి ఎం.అశ్విన్ కుమార్ ఆచారి స్థానిక హినకల్ కెనరా బ్యాంకులో బంగారు నగల అప్రైజర్‌గా ఉద్యోగం చేసేవాడు. జనం తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల నుంచి కొంత మొత్తం కొట్టేసేవాడు. ఇటీవల నగలను విడిపించుకుని వెళ్లిన ఖాతాదారులు తమ బంగారం బరువు తగ్గిపోవడంతో గత డిసెంబరులో బ్యాంకు ముందు నిరసన తెలిపారు. 19 గ్రాములు ఉన్న తమ చైను ఇప్పుడు 16 గ్రాములే ఉందని ఓ మహిళ వాపోయింది. ఇలా అతని చేతిలో వందలాది మంది మోసపోయారు. ఈ నేపథ్యంలో నిందితుడు విదేశాలకు పరారయ్యాడు. బెంగళూరు విమానాశ్రయంలో దిగి మరోచోటుకు వెళ్తుండగా మైసూరు పోలీసులు అతనిని పట్టుకుని నగరానికి తీసుకువచ్చారు. ఇతడు పెద్ద పెద్ద చైన్‌లు, ఉంగరాలు పెట్టుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు.
పరారీలో ఉన్న అప్రైజర్ అరెస్టు


