ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం
రాయచూరు రూరల్: మహాశివరాత్రి సందర్భంగా సంగమేశ్వరుడి దర్శనం కోసం వెళ్లిన వృద్ధ దంపతులను ఆర్టీసీ సిబ్బంది మార్గంమధ్యలో వదిలి వెళ్లిపోయారు. ఈ యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం యాదగిరి నుంచి సంగమేశ్వర దేవాలయానికి వెళ్లేందుకు అన్నపూర్ణ, సంగమేశ్వర్లు దంపతరులు ఆర్టీసీ బస్సు ఎక్కారు. అయితే స్టేజీ కిలోమీటర్ దూరం ఉండగానే మార్గంమధ్యలో గూండ్లూరు వద్ద దింపేసి వెళ్లారు. ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వృద్ధ దంపతులు కిలోమీటర్ నడుచుకుని వెళ్లాల్సి వచ్చింది.


