హంపీలో జనసందోహం
● ముగిసిన హంపీ ఉత్సవాలు
● ఉర్రూతలూగించిన
మంగ్లీ పాటలు, నృత్యాలు
● ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన
సాక్షి బళ్లారి/హొసపేటె: గత రెండు రోజులుగా పర్యాటకులను కనువిందు చేసిన హంపీ ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. మొదటి రోజు కంటే శని, ఆదివారాల్లో ప్రజలు భారీగా విచ్చేయంతో హంపీ వీధులు కిక్కిరిపోయాయి. హంపీలోకి ప్రవేశించే దారిలో నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. ఎంపీ ప్రకాష్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు లక్షలాది మందిని మంత్రముగ్ధుల్ని చేశాయి. ప్రధానంగా ప్రముఖ గాయినీ మంగ్లీ అలియాస్ సత్యవతి హంపీ ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో తన పాటలతో ఉర్రూతలూగించారు. కన్నడ, తెలుగు పాటలు పాడుతూ వాటికి నృత్యాలు చేయడంతో ఎంపీ ప్రకాష్ వేదిక ఈలలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. విజయనగర కాలంలో శ్రీ కృష్ణదేవరాయ గత వైభవాన్ని గుర్తు చేసేలా అధికారులు కార్యక్రమాలు నిర్వహించారు.
హంపీలో జనసందోహం
హంపీలో జనసందోహం
హంపీలో జనసందోహం
హంపీలో జనసందోహం
హంపీలో జనసందోహం
హంపీలో జనసందోహం


