వెయ్యి దినాలు.. వెయ్యి అబద్ధాలు
శివాజీనగర: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పరిపాలన, వెయ్యి సమస్యలు అని బీజేపీ ఆరోపించింది. శనివారం బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి విజయాలు లేకుండా ఈ ప్రభుత్వం విజయోత్సవ సభలు జరుపుకొంటోంది. వెయ్యి దినాల్లో వెయ్యి సమస్యలు వచ్చాయి అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పనిలో నిమగ్నం కాగా, రాష్ట్ర ప్రభుత్వం నిరీక్షణలతోనే గడుపుతోందన్నారు. పంచ గ్యారెంటీలు పంక్చర్‌లై చాలా రోజులైంది. రోడ్ల గుంతల మూసివేయలేదు. అభివృద్ధి లేదు. అవినీతి మాత్రమే ఉంది. అవినీతిలో దేశానికే ఆదర్శంగా ఉన్నారు అని దుయ్యబట్టారు. వెయ్యి అబద్ధాలు చెప్పి ప్రజలకు మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు ప్రభుత్వాన్ని కుదువ పెట్టారు, ఇక్కడ దోచుకొని హైకమాండ్‌కు అందిస్తున్నారని ఆరోపించారు. వాల్మీకి మండలి స్కాం, ముడా అక్రమాలు, స్మార్ట్ మీటర్లు, ఎకై ్సజ్ శాఖలో కుంభకోణాలు, గృహలక్ష్మీ పథకంలో అక్రమాలు జరిగాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రం 25 సంవత్సరాల వెనక్కి వెళ్లింది. ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని ఆరోపించారు. రైల్వే పథకాలకు తన వాటా సొమ్ము ఇవ్వలేదని అన్నారు.
రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది
బీజేపీ నేత విజయేంద్ర


