● సుబ్రహ్మణ్యేశ్వర రథోత్సవం
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం సమీపం చిత్రావతి గ్రామంలో శనివారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి స్వామికి అభిషేకం, వివిధ అలంకారాలు, పూజలు నిర్వహించారు. జిల్లా నుంచే కాకుండా బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తజనం తరలివచ్చారు. స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ కళ్యాణిలో గంగా పూజలు నిర్వహించారు. సుందరంగా అలంకరించిన తేరులో స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించి ఊరేగించారు. నమో సుబ్రహ్మణ్య అంటూ భక్తులు తేరును లాగారు. ప్రసాద పంపిణీ, అన్నదానాలు జరిగాయి.


