గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
కోలారు : విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గుండె పోటుతో మరణించిన ఘటన జిల్లాలోని ముళబాగిలు పట్టణంలో చోటు చేసుకుంది. ముళబాగిలు నగర ముత్యాల పేటకు చెందిన సుబ్రమణి (49) నంగలి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి 112 ట్రాఫిక్ వాహనంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించినా చికిత్స ఫలించక మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
త్రిచక్రవాహనం అందజేత
కోలారు : దివ్యాంగుడికి కలెక్టర్ త్రిచక్రవాహనం అందించి అండగా నిలిచారు. జిల్లా కలెక్టర్ ఎం ఆర్ రవి బృహత్ స్వచ్ఛతా ఆందోళన కార్యక్రమం కోసం నగరంలో సంచరిస్తుండగా స్థానిక ఆటో డ్రైవర్లు కలిసి దివ్యాంగుడైన ఖాసీంఖాన్ ఇబ్బందులను వివరించారు. దీంతో కలెక్టర్ స్పందించి త్రిచక్రవాహనం అందించాలని నగరసభ కమిషనర్ నవీన్ చంద్రను ఆదేశించారు. ఖాసిం ఖాన్‌కు నగరసభ నుంచి చిన్న వ్యాపారం చేసుకోవడానికి తగిన అవకాశం కల్పించాలని, ఫించన్ అందించాలని ఆదేశించారు.
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి


