ఆదిమ సాంస్కృతిక కేంద్రంలో శిక్షణ
కోలారు: నగర సమీపంలోని ఆదిమ సాంస్కృతిక కేంద్రంలో కన్నడ సాహిత్యానికి సంబంధించి నెలపాఠ్యాల రచనా కమ్మటం పేరుతో ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శనివారం రాత్రి ఆదిమ రంగభూమి శిక్షణా కేంద్రం పాలక మండలి అధ్యక్షుడు మునిరత్నప్ప, ఆదిమ కేంద్రం అధ్యక్షుడు మునిస్వామి ప్రారంభించారు. మునిరత్నప్ప మాట్లాడుతూ నెలపాఠ్యాలను రచించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కన్నడ సాహిత్యంలో నెలపాఠ్యాలను ఎవరు, ఎప్పుడు ఏ విధంగా పరిచయం చేశారనే విషయాన్ని తెలిపారు. అనంతరం డాక్టర్ సరోజా మాట్లాడారు సిండికేట్ పభ్యుడు ఆర్బాజ్‌పాషా, ఆదిమ అధ్యక్షుడు మునిస్వామి,నాయక్, అగ్రహార రమేష్ పాల్గొన్నారు.


