లిథియం వెలికితీతకు శ్రీకారం
రాయచూరు రూరల్: కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు, కొప్పళ్ జిల్లాలో బంగారం, లిథియం నిక్షేపాల వెలికితీతకు సర్కారు శ్రీకారం చుడుతోంది. జియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా ఇప్పటికే ఆ ప్రాంతాల్లో నిక్షేపాలు ఉన్నట్లు గుర్తిండచంతో కర్ణాటక సర్కారు అనుమతులు లభించగానే పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొప్పళ్ జిల్లా కుష్టిగి తాలుకా అమరాపుర బ్లాక్‌లో టన్ను మట్టికి 14 గ్రాముల బంగారం, రాయచూరు జిల్లా లింగసూగురు తాలుకా గురుగుంట అమరేశ్వరలో లిథియం నిక్షేపాలు లభించాయి. లిథియంను ఎలక్ట్రానిక్ ఉత్పాదకాలు, వాహనాల బ్యాటరీ తయారీకి ఉపయోగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ అధికారులతో చర్చలు జరిపి రెండు విడతలుగా తవ్వకాలు జరపాలని నిర్ణయించింది.


