అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
హొసపేటె: రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వాహనంపై పోలీసులు దాడి చేసిన సంఘటన విజయనగర జిల్లా కొట్టూరు తాలూకా నాగేనహళ్లిలో ఆదివారం జరిగింది. కొట్టూరు నుంచి చిత్రదుర్గం జిల్లా చెళ్లికెర వైపునకు బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన విజయనగరం జిల్లా కొట్టూరు పీఎస్‌ఐ గీతాంజలిషిండే దాడులు నిర్వహించారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్న ఆటో, 760 కిలోల బియ్యం కలిగిన 21 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


