మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యత పాటించాలి
కోలారు: మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన బోజనం అందించాలని శిక్షణాధికారి తిమ్మరాయప్ప సూచించారు. ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తాలూకాలోని వేమగల్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో వేమగల్ ఫిర్కా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల వంట సిబ్బందికి ఆదివారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వంట సిబ్బంది విద్యార్థులను తమ సొంత పిల్లలుగా చూడాలన్నారు. వంట గదిలో శుచి శుభ్రత పాటించాలన్నారు. వంటగదిలోకి ఇతరులను అనుమతించవద్దని తెలిపారు. అక్షర దాసోహ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రమణి మాట్లాడుతూ వంట చేసే సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆరోగ్య శిక్షణాధికారి గీతా పాల్గొన్నారు.


