ఉత్తర కర్ణాటక కేడీఎం కింగ్ మృతి
హుబ్లీ: పశువులను బెదిరించే పోటీల్లో 11 బైకులు, బంగారం, ఎద్దుల బండి, టీటీతో పాటు ఎన్నో పథకాలు, అవార్డులు, రివార్డులు తన గంభీరమైన పాదాలతో దర్శించుకుని పేరు మోసిన కేడీఎం కింగ్ గుండెపోటుతో మరణించింది. వివరాలు.. కేడీఎం కింగ్‌గా పేరుగాంచిన హావేరి జిల్లా బ్యాడిగి తాలూకా కదరమండలగి గ్రామ గాంభీర్య రోషవేషాల ప్రతికా వృషభం గుండెపోటుతో మృతి చెందింది. సుమారు 18 సంవత్సరాల వయస్సులో ఉన్న ఈ వృషభ రాజానికి శుక్రవారంతో నూకలు చెల్లాయి. అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. ఉత్తర కర్ణాటక ప్రసిద్ధ కొబ్బరి వృషభాల అనగా బలిసినా ఎద్దుల పోటీలలో అందరి కళ్లను తన వైపే ఆకర్షించిన ఈ వృషభం మృతికి అక్కడి గ్రామ వాసుల గుండెలు బరువెక్కాయి. దాని యజమాని కాంతేష్ రాయకర్ ఇంటి ముందు వృషభ రాజ్యం మృత కళేబరాన్ని తుది దర్శనం కోసం ఉంచారు. దీంతో పోటాపోటీగా విజేతగా నిలిచిన ఈ వృషభాన్ని కడసారి చూడటానికి రాష్ట్రం నుంచే కాక తమిళనాడు నుంచి కూడా అభిమానులు విచ్చేసి దానికి పూల దండలు, అగరబత్తీలు, అక్షింతలు వేసి పూజలు చేశారు. ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు.
అశ్రునయనాలతో అంతిమయాత్ర
శుక్రవారం మధ్యాహ్నం ఆ గ్రామ ప్రముఖ వీధుల్లో అంతిమయాత్ర జరిపారు. యాత్రలో వివిధ జానపద బృందాలు పాల్గొన్నాయి. మా ఊరి రోషం, ఘనత, డాబు, దర్పాలకు ప్రతీకగా నిలిచిన వృషభరాజ్యం అంత్యక్రియలను తమ ఇంటి పెద్ద కుమారుడిలానే ఆ ఊరి ప్రజలు నెరవేర్చారు. ఏ పోటీల్లో చూసినా మన కేడీఎందే డాబు, దర్బారు. అవార్డులు కానీ, రివార్డులు కానీ, పథకాలు కానీ మన కేడీఎంకే సింహపాలు రావాల్సిందే. కేడీఎం కింగ్ 108 అంటే దానిని సాకగానే పక్కనే ఉన్న అంబులెన్స్‌ను సిద్ధం చేసుకొనే దానితో తలపడాలి. ఆ మేరకు మసణ దొరె, కిల్లింగ్‌స్టార్, వరుణనాడు ప్రజల ఆయువు కాంతేశుడు అనే బిరుదులతో పౌరుషానికి ప్రతీకగా నిలిచిన కేడీఎం కింగ్ తిరిగి రాని లోకాలకు బైబై చెప్పి వెళ్లిపోవడంతో స్థానికులు ఈ వృషభరాజం మృతిని జీర్ణించుకోవడానికి మరికొంత కాలం పట్టవచ్చు. అయితే సదరు యజమాని కుటుంబ సభ్యులు మాత్రం ఇలాంటి ఎద్దు దొరకడం అసాధ్యమని, అయితే జల్లికట్టు పోటీల కోసం మళ్లీ మరొక వృషభ రాజాన్ని సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
కన్నీరుమున్నీరైన అభిమానులు
కడసారి చూపునకు భారీగా రాక
ఉత్తర కర్ణాటక కేడీఎం కింగ్ మృతి
ఉత్తర కర్ణాటక కేడీఎం కింగ్ మృతి


