తెరచుకోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు
హుబ్లీ: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఎక్కడో చెప్పండి బాబోయ్.! అని అంటున్నారు దావణగెరె జిల్లా రైతులు. వివరాలు.. వెన్నదోశెకు పేరొందిన నగరం దావణగెరె జిల్లాలో ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న విక్రయించే మార్గాల కోసం కన్నడ రైతన్న పడరాని పాట్లు పడుతున్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. దావణగెరె జిల్లాలో మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభిస్తాం, ప్రతి ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున గరిష్టంగా 50 క్వింటాళ్ల వరకు కొనుగోలుకు చర్యలు తీసుకుంటాం. ప్రతి క్వింటాల్‌కు రూ.2400ల మద్దతు ధర నిర్ణయించామని ఆ జిల్లాధికారి డాక్టర్ గంగాధర్ స్వామి ఆర్భాటంగా పత్రికా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే రైతులు తమ పేరు నమోదు కోసం మొత్తం ఏపీఎంసీ మార్కెట్ కలియ తిరిగినా ఒక్క చోటైనా కొనుగోలు కేంద్రం కనబడితే అదే పది వేలు అనుకున్న రైతన్నకు మొండి చేయి మిగిలింది.
ఫలించని జిల్లాధికారి భరోసా
జిల్లాధికారి కార్యాలయ మీటింగ్ హాల్లో మొక్కజొన్న కొనుగోలు గురించి జరిగిన సమావేశంలో డీసీ గంగాధర స్వామి పైమేరకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రబీ సీజన్‌లో రైతులు పండించిన మొక్కజొన్నలను కొనుగోలు చేస్తాం. డిస్టిలరీ యజమానులు మొక్కజొన్నల కొనుగోలు తేదీ నుంచి మూడు రోజుల్లో ఆ రైతులకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లిస్తామని డీసీ వివరించారు. అంతేగాకుండా సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో 730 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. రైతులు ప్రయోజనం పొందాలని సూచించారు. సహకార శాఖ, ఏపీఎంసీ అధికారులు మొక్కజొన్నల కొనుగోలు గురించి సమాచారం ఉన్న కరత్రాలను ముద్రించి రైతులకు ఇవ్వాలి. ఎటువంటి గందరగోళం లేకుండా అధికారులు అన్నదాతకు అండగా నిలవాలని సూచించారు.
పంట విక్రయానికి నానా పాట్లు
అన్నదాతల్లో ఆనందం ఆవిరి


