పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకం
కార్యక్రమానికి హాజరైన న్యాయవాదులు, కక్షిదారులు, ప్రజలు
కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న
డీఐజీ, న్యాయమూర్తులు, ఇతర అతిథులు
సాక్షి,బళ్లారి: కేసుల పరిష్కారంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల(ప్రభుత్వ న్యాయవాదుల) పాత్ర కీలకమని బళ్లారి రేంజ్ డీఐజీ వర్తిక కటియార్ పేర్కొన్నారు. ఆమె నగరంలోని పాత జిల్లా కోర్టు ఆవరణలో శనివారం బళ్లారి, కొప్పళ, విజయనగర జిల్లాల నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్ విభాగ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యాలయం ద్వారా ప్రభుత్వం తరఫున కేసులను కోర్టుల్లో ఎలా ప్రతిపాదించాలి అన్న విషయంపై న్యాయవాదులకు అవగాహన కల్పించడానికి దోహదపడుతుందన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీ.ఎస్ పాటిల్ మాట్లాడుతూ పెండింగ్ కేసులు ఏ స్థితిలో ఉన్న ఉన్నాయో ఆ కేసుల్లో ఎలాంటి తీర్పులు వెల్లడించారో పూర్తి వివరాలు లభిస్తాయన్నారు. సీనియర్ లా ఆఫీసర్ బళ్లారి.కామ్ వెబ్‌సైట్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ శాఖ డైరెక్టర్ అంజలిదేవి ప్రారంభించగా, న్యాయజ్యోతి సంచికను వివిధ జిల్లాల ఎస్పీలు డాక్టర్ శోభారాణి, డాక్టర్ రామ్ అరసిద్ధి, జాహ్నవి ప్రారంభించారు. కేసులు నమోదు చేసుకున్న వారి కోసం జాగృతి అభియాన్‌ను జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. నగర మేయర్ గాదెప్ప, ప్రముఖులు ముండ్రిగి నాగరాజు, సుంకన్న, రామబ్రహ్మం పాల్గొన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకం


