తేరహళ్లి కొండపై నీటి ఎద్దడి
తేరహళ్లి గ్రామంలోని బావి
డ్రమ్ములో నీరు నిల్వ చేసుకున్న గ్రామస్థులు
కోలారు: కొండరాజనహళ్లి పంచాయతీ పరిధిలోని తేరహళ్లి కొండపైన ఏడు గ్రామాలలో తాగునీరు, కనీస వసతులు కరవయ్యాయి. కొండపై తేరహళ్లి, కుప్పళ్లి, ఆదిమ (శివగంగ), పాపరాజనహళ్లి, కెంచగౌడనహళ్లి, బెట్టహొసహళ్లి, గ్రామాలు ఉన్నాయి. 500కు పైగా ఇళ్లలో జనం నివాసముంటున్నారు. నీటి సమస్యను అధిగమించడానికి ఇక్కడి జనం ఇంటి ఎదుట డ్రమ్ములు పెట్టుకొని వాటిలో నీరు నింపుకుంటున్నారు. ఏ గ్రామంలో చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. ప్రస్తుతం గ్రామస్థులకు తాగడానికి ప్రభుత్వం తాగునీరు అందించలేని పరిస్థితి. కొండపై బోరు వేసేందుకు అవకాశం లేకపోవడంతో దూరంగా ఉన్న చెరువులు, బావుల నీటినే గ్రామస్థులు తాగుతున్నారు. కనీస వసతులైన మురుగు కాల్వలు, వీధి దీపాలు, ఆరోగ్య కేంద్రం సౌకర్యాలు కూడా లేవు. చిరుతలు సంచరిస్తున్నా.. భయం నీడన ఇక్కడ జనం జీవనం సాగించాల్సి వస్తోంది. కొండ కింద 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు నిర్మించాలని తలపెట్టినా నిధుల కొరతతో ఆగిపోయింది. సమస్యను పరిష్కరించి తాగునీరు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
తేరహళ్లి కొండపై నీటి ఎద్దడి


