మాజీ మంత్రి కారు ఢీకొని బైకిస్టు మృతి
దొడ్డబళ్లాపురం: మాజీ మంత్రికి చెందిన కారు ఢీకొని బైకిస్టు మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి మాగడి తాలూకా గుడేమారనహళ్లి వద్ద చోటుచేసుకుంది. బిళుగుంబ గ్రామ నివాసి రాజేశ్(24) గురువారం రాత్రి 11–45 గంటల సమయంలో స్నేహితుడితో కలిసి బైక్‌పై వస్తుండగా మాజీ మంత్రి హెచ్‌ఎం రేవణ్ణ కుటుంబానికి చెందిన ఫార్చునర్ కారు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాజేశ్ అక్కడికక్కడే మృతిచెందగా అతడి స్నేహితుడు గాయపడ్డాడు. అయితే కారు నిలపకుండా పరారవుతుండడంతో స్థానికులు 5 కి.మీ.వెంబడించి పట్టుకున్నారు. కారులో ఉన్న వ్యక్తి తాను మాజీ మంత్రి హెచ్‌ఎం రేవణ్ణ కుమారుడు శశాంక్ అంటూ బెదిరించాడు. కుదూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. రాజేశ్ మృతదేహాన్ని నెలమంగళ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
డీకే కోసం బీజేపీ ఆపరేషన్
● యత్నాళ్ కొత్త బాంబు
శివాజీనగర: తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినపుడు డీకే శివకుమార్‌ను బీజేపీలోకి చేర్చుకునే ప్రయత్నం జరిగిందని ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ కొత్త బాంబు పేల్చారు. బెళగావిలో శుక్రవారం మాట్లాడిన ఆయన, తనను సస్పెండ్ చేసిన సందర్భంలో ఢిల్లీలో డీకే శివకుమార్‌ను కోసం ఆపరేషన్ చేసే ప్రయత్నం జరిగింది. తాను పార్టీలో ఉంటే కాదనే ఉద్దేశ్యంతో తనను సస్పెండ్ చేసిన తరువాత ఆ ప్రయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయేంద్ర డీసీఎం కావటానికి ఢిల్లీలో డీకే శివకుమార్‌ను కలిసి చర్చలు జరిపారు. బీజేపీవారే ఈ విషయం తనకు చెప్పారు. ఆ తరువాత ప్రహ్లాద్ జోషి, అమిత్ షా సూచనల మేరకు తాము ఎవరినీ చేర్చుకోవటం లేదని చెప్పారు. అయితే నిజంగా డీకే శివకుమార్‌ను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందని అన్నారు.
ఆస్పత్రి ఆవరణలో
మనిషి పుర్రె ప్రత్యక్షం
దొడ్డబళ్లాపురం: ఆస్పత్రి ఆవరణలో మనిషి పుర్రె కనిపించి రోగులను భయాందోళనకు గురి చేసిన సంఘటన నెలమంగలలో వెలుగు చూసింది. నెలమంగల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో చెత్త వేసే చోట మనిషి పుర్రె కనిపించింది. పుర్రెను చూసిన జనం భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడకు పుర్రె ఎలా వచ్చింది, ఎవరు తెచ్చి వేసారో తెలియరాలేదు. ఆస్పత్రి వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి పుర్రెను పరిశీలించారు.
అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇచ్చిన మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్
రూ.5 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి?
ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి
మాజీ మంత్రి కారు ఢీకొని బైకిస్టు మృతి
మాజీ మంత్రి కారు ఢీకొని బైకిస్టు మృతి


