డీకే వర్గం రహస్య సమావేశం
డీకే శివకుమార్ మరింత బలాన్ని క్రోడీకరించుకునేందుకు తన అనుచరులతో రహస్య సమావేశం జరిపారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన అనుచరుల కోసం మాజీ ఎమ్మెల్యే ఫిరోజ్ సేఠ్, ఆసిఫ్ సేఠ్ రెండు రోజుల క్రితం విందు ఏర్పాటు చేశారు. ఇందుకు డీకే శివకుమార్, ఆయన వర్గం గైర్హాజరైంది. దీంతో డీకేశి కోసం శనివారం మరోసారి విందు ఏర్పాటు చేశారు. అలాగే గురువారం రాత్రి బెళగావి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దొడ్డణ్ణనవర్..డీకే శివకుమార్, ఆయన మద్దతుదారులకు విందు ఇచ్చారు. ఇందులో పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారని సమాచారం. ఈ ప్రత్యేక విందు సమావేశాలు కాంగ్రెస్‌లో గందరగోళ వాతావరణాన్ని సృష్టించాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కలసికట్టుగా కూర్చోబెట్టి నాయకత్వ విషయంపై స్పష్టత ఇవ్వటానికి ఈ నెల 19న ఢిల్లీలో సమావేశం జరగనుందని తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో సమావేశం జరగనుంది. ఆరోజు నాయకత్వ మార్పునకు స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.
బెళగావి సువర్ణ సౌధ
డీకే వర్గం రహస్య సమావేశం
డీకే వర్గం రహస్య సమావేశం


