చిలుక తెచ్చిన తంటా
● విద్యుదాఘాతంతో యువకుడి మృతి
దొడ్డబళ్లాపురం: చిలుకను రక్షించబోయి యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందిన సంఘటన బెంగళూరు గిరినగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. అరుణ్‌కుమార్(32) అనే వ్యక్తి ఫారిన్ నుంచి రూ.2 లక్షల విలువైన చిలుకను కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. అది ఎగిరి వెళ్లి అపార్ట్‌మెంట్ లోపలి నుంచి వేయబడ్డ హైటెన్షన్ విద్యుత్ తంతిపై వాలింది. అరుణ్‌కుమార్ స్టీల్ పైప్‌కి కర్ర కట్టి అపార్ట్‌మెంట్ కాంపౌండ్ గోడ ఎక్కి చిలుకను రక్షిస్తుండగా విద్యుత్ షాక్‌కి గురై మృతిచెందాడు. గిరినగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


