భక్తిభావాలు పెంచుకోవాలి
రాయచూరు రూరల్: మానవులు జీవితంలో భక్తిభావాలు పెంపొందించుకునేందుకు కృషి చేయాలని శ్రీశైల పీఠాధిపతి జగద్గురు ప్రసన్న చంద్రశేఖర శివాచార్య పిలుపు ఇచ్చారు. మంగళవారం సింధనూరు తాలూకా బంగారి క్యాంప్‌లో రౌడకుంద సిద్దాశ్రమలో ఆధ్యాత్మిక వేడుకలో ఆయన మాట్లాడారు. మానవుడు పని ఒత్తిళ్లతో ప్రతి నిత్యం ఎంతో మథనపడుతున్నాడన్నారు. రోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. దేశంలో ధర్మం, దేవాలయ రక్షణకు సమాజంలో భక్తులు చేస్తున్న సేవలు దోహదపడతాయన్నారు. సమావేశంలో స్వామీజీలు శాంత మల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, వీరసంగమేశ్వర స్వామీజీలున్నారు.


