గోవుల సంరక్షణ మన ధర్మం | - | Sakshi
Sakshi News home page

గోవుల సంరక్షణ మన ధర్మం

Dec 6 2025 8:45 AM | Updated on Dec 6 2025 8:45 AM

గోవుల

గోవుల సంరక్షణ మన ధర్మం

రాయచూరురూరల్‌: గోవుల సంరక్షణ ప్రజల ధర్మమని పేజావర్‌ అధోక్ష మఠాధిపతి విశ్వప్రసన్న తీర్థశ్రీ పాదంగల్‌, సోమవారిపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యులు అన్నారు. సన్నతి సేవా సంస్థ అధ్వర్యంలో నగరంలోని ఇస్కాన్‌ మందిరంలో గురువారం నవజాత గోవులకు వారు పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ నామకరణాలకు నివాసాలకు వెళ్లడం పరిపాటి అని, కానీ దూడల నామకరణానికి భక్తులు రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజ్‌, చంద్రశేఖర్‌, దేవిశెట్టి పాల్గొన్నారు.

భవన నిర్మాణానికి

భూమి పూజ

రాయచూరురూరల్‌: నగరంలో గాయత్రీ భవన నిర్మాణ పనులను విధాన పరిషత్‌ సభ్యుడు వసంత్‌కుమార్‌ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నగరంలోని సిద్ధనాథ కాలనీలో రూ.25 లక్షలతో భవన నిర్మాణం చేపట్టామన్నారు. పాత జిల్లా కావడంతో అన్ని వర్గాల ప్రజలకు తగిన విధంగా మౌలిక వసతులు కల్పించడానికి వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్‌ కులకర్ణి, నరసింగరావు, మురళీధర్‌, మోహన్‌, ఆనంద్‌ పడ్నవీస్‌, శ్రీనివాస్‌, సుధీంద్ర, సుధీర్‌ పాల్గొన్నారు.

మట్కా, జూదాలను

నియంత్రించాలి

రాయచూరురూరల్‌: లింగసూగురులో మట్కా, జూదాలను వెంటనే నియంత్రించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ నాగలక్ష్మీ చౌదరి ఆదేశించారు. హట్టిలో వివిధ కార్యాలయాలను ఆమె సందర్శించి వివరాలు అందజేయాలని కోరారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రమేష్‌తో ఆమె మాట్లాడారు. మట్కా, గంజాయి, క్రికెట్‌బెట్టింగ్‌, హఫీమ్‌, లిక్కర్‌ మాఫియా కొనసాగుతున్నా.. పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు అధికమైనట్లు వివరించారు.

21 నుంచి పల్స్‌ పోలియో

రాయచూరురూరల్‌: జిల్లాలో ఈ నెల 21వ తేదీ నుంచి జరిగే పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలని జిల్లా అధికారి నితీష్‌ వైద్యాధికారులకు సూచించారు. స్థానిక జిల్లా అధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నితీష్‌ మాట్లాడుతూ నాలుగురోజుల పాటు 0–5 వయస్సు పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ప్రతి ఒక్కరికీ పోలియో చుక్కలు వేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్యాధికారి సురేంద్రబాబు, అర్‌సీహెచ్‌ అధికారి నందిత, విజయ్‌శంకర్‌, ప్రవీణ్‌కుమార్‌, ఆరతి, శివమానప్ప, అనిల్‌, గణేష్‌, శివ కుమార్‌, షాకీర్‌, ఈశ్వర్‌, బసయ్య పాల్గొన్నారు.

భూసారాన్ని రక్షించుకోవాలి

బళ్లారి అర్బన్‌: భూ సారాన్ని రైతులు పరిరక్షించుకోవాలని బీజేపీ రైతు మోర్చా జిల్లా అధ్యక్షుడు గణపల్‌ ఐనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. విలేకరులతో అత్యాధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని భావితరాలకు ఉపయోగపడేలా భూసారాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రసాయన ఎరువులు వాడడంతో పంటలు నాశనం అవుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు మొక్కజొన్న పంట సాగు తీరును ఆయన చక్కగా వివరించారు.

భోగనంజుండేశ్వరుడికి పూజలు

మాలూరు: మాస్తి గ్రామంలోని ప్రసిద్ధ భోగనంజుండేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం స్వామికి విశేష పూజలు, లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామిని ప్రత్యేక పూలతో అలంకరించారు. మాస్తి గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. మహిళలు ప్రమిదలను, నంది ఆలయం వద్ద దీపాలను వెలిగించారు.

గోవుల సంరక్షణ మన ధర్మం 1
1/3

గోవుల సంరక్షణ మన ధర్మం

గోవుల సంరక్షణ మన ధర్మం 2
2/3

గోవుల సంరక్షణ మన ధర్మం

గోవుల సంరక్షణ మన ధర్మం 3
3/3

గోవుల సంరక్షణ మన ధర్మం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement